31-07-2025 09:55:53 PM
వజ్రేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపిన బోడుప్పల్ ఆటో యూనియన్
మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లికార్జున ఆటో యూనియన్ సభ్యులు గత కొంతకాలంగా ఆటో స్టాండ్ స్థలం లేక బోడుప్పల్ కమాన్ పరిసర ప్రాంతాల్లో గల కాళీ ప్రదేశాల్లో ఆటోలు నిలపడం తో ఒకవైపు పోలీసులు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఆటోలను పెట్టనివ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఉప్పల్ డిపో వద్దగల ఆటో స్టాండ్ ను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఉప్పల్ బస్ డిపో వద్ద గల స్థలంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ త్రివేశ్వరరావును కోరారు. నెలకు రూ.12 వేలు ఆటో కార్మికులకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ,అర్హులైన ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా కృషి చేస్తూ, కార్మికులందరికీ అండగా ఉంటానని వజ్రేష్ యాదవ్ అన్నారు.