17-05-2025 07:54:17 PM
సూర్యాపేట (విజయక్రాంతి): స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా బాల్ భవన్ ఉచిత సమ్మర్ క్యాంప్ ను శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనా ప్రతి విభాగంకి వెళ్లి స్టూడెంట్స్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎండాకాలం సెలవులను వృధా చేసుకోకుండా ఏదో ఒక కళను నేర్చుకుని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి విద్యార్థి జీవితంలో పనికి వస్తుంది కాబట్టి బాల్ భవన్ లో వున్న నిష్ణాతులు అయిన గురువులచే ఏర్పాటు చేసిన ఈ శిక్షణ ద్వారా అందరూ ప్రయోజనం పొందాలని సూచించారు. వేసవిలోనే కాక స్టూడెంట్స్ వీలును బట్టి ఏడాది పొడవునా సాయంత్రం నిరంతరంగా జరిగే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈయన వెంట జడ్ పి హెడ్మాస్టర్ పద్మ, బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి, సిబ్బంది దాసరి ఎల్లయ్య, సత్యనారాయణ సింగ్, ఉమ, అనిల్, సాయి, వీరు, తదితరులు పాల్గొన్నారు.