10-01-2026 12:10:49 AM
ఏర్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ పీవో
ఉట్నూర్, జనవరి 9 (విజయక్రాంతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈనెల 12వ తేదీన జిల్లా పర్యటించే అవకాశం ఉందని జిల్లా అధికార వర్గాలు తెలిపాయి. డిప్యూటీ సీఎం జిల్లా పర్యటన ఖరారు కానున్న నేపథ్యంలో శుక్రవారం ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్, డిఆర్డిఓ పిడి రాథోడ్ రవీందర్, ఇతర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ సీఎం పర్యటలో ఆయా శాఖలకు అప్పగించిన పనులను ఈనెల 13 లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఐటిడిఏ డిడి జాదవ్ అంబాజీ, సర్పంచ్ మెస్రం తుకారం, అధికారులు పాల్గొన్నారు.