10-01-2026 12:10:26 AM
ఘట్‌కేసర్, జనవరి 9 (విజయక్రాంతి) : చైనా మాంజా అమ్ముతున్న ఓ వ్యక్తి పై ఘట్ కేసర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఘట్‌కేసర్ పట్టణంలోని ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన రంజిత్ నిషేధించ బడిన చైనా మాంజ అమ్ముతుండడంతో పక్కా సమాచారంతో ఘట్ కేసర్ పోలీసులు పట్టుకొని మాంజతో కూడిన బాబిన్స్ బెండలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.