12-05-2025 06:05:56 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు మంగళవారం టేకులపల్లి మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మండలంలోని బేతంపూడి దర్గా నుంచి మద్దిరాలతండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంఖుస్థాపన చేస్తారు. అనంతరం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ కు శంఖుస్థాపన చేస్తారు. తదనంతరం మండలంలోని సింగరేణి కోయగూడెం ఉపరితల గనిని పరిశీలించనున్నారు. ఉపముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొంటారు.