calender_icon.png 20 December, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు గ్రామాలకు ఉప సర్పంచ్‌ల ఎంపిక

20-12-2025 01:47:12 AM

మర్రికుంట, డిసెంబర్ 19 : మర్రిగూడ మండలంలోని ఏరుగండ్లపల్లి, మర్రిగూడ, మేటి చందాపురం గ్రామాలకు  శుక్రవారం నూతన ఉప సర్పంచులను అధికారుల సమక్షంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిలో ఎరుగండ్లపల్లి ఉప సర్పంచ్‌గా చామకూర కృష్ణమ్మను,  మర్రిగూడ మహేశ్వరం రమేషు, మేటి చందాపురం ఉప సర్పంచ్‌గా కుంభం వేణుగోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతనంగా ఎంపికైన ఉప సర్పంచ్ లు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో సర్పంచ్ కు, చేదోడు వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ నూతన సర్పంచులు, సంబంధిత ఎన్నికల అధికారులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.