07-10-2025 12:58:00 AM
కోనరావుపేట,అక్టోబర్ 06 (విజయక్రాంతి): రాజ న్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా రొక్కం దేవారెడ్డి,ప్రధాన కార్యదర్శిగా జొ న్నల రాజేందర్ గౌరవ అధ్యక్షులుగా మల్యాల ప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్ననారు. కోనరావుపేట మండల నూతన ప్రెస్ క్లబ్ ను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షులుగా కస్తూరి తిరుపతిరెడ్డి,దుంపటి నాగరాజు,గొర్రె సుధాకర్, ఎల్లే శ్రీనివాస్,ముఖ్య సలహాదారు దప్పుల కరుణాకర్, కోశాధికారిగా తాళ్లపల్లి దిలీప్, సంయుక్త కార్యదర్శి దండు దేవేందర్,గండి నరేష్,కార్యవర్గసభ్యులు తడుక శ్రీనివాస్,దప్పుల నరేష్,మాందాల సంజీవ్,ఎర్రవెల్లి నరేష్,సాసర్ల గంగాధర్, పర్శరాములు,తాళ్లపల్లి శ్రీకాంత్,సాసాల సురేష్, మిర్యాల కిషన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షులు ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా మండలంలో అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు మాకు సహకారం చేయాలని కోరా రు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యల వారధిగా పని చేస్తున్న హార్హులైన విలేఖర్లకు ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అయన కోరారు.