06-08-2025 12:00:00 AM
నారాయణపేట.ఆగస్టు 5(విజయక్రాంతి):నారాయణపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. టి.జి. ఎంఎస్‌ఐడిసీ ప్రాజెక్టు పరిధిలో రూ.26 కోట్ల వ్యయంతో నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల ప్రభుత్వ మెడికల్ కళాశాల/జిల్లా ఆస్పత్రి పక్కన కొనసాగుతున్న నర్సింగ్ కాలేజ్, రూ.40 కోట్ల నిధులతో చేపట్టనున్న ఎంసీహెచ్ ( మెటర్నిటీ చైల్ హెల్త్) సెంటర్ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు.
ముందుగా నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులను చూసిన కలెక్టర్ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. నర్సింగ్ కాలేజ్ భవనంతో పాటు చుట్టూ ప్రహరీని ఏర్పాటు చేయాలన్నారు. అయితే కాలేజ్ కి అటు వైపు కొంత స్థలం ఆక్రమణ కు గురవుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు రావడంతో స్పందించిన కలెక్టర్ వెంటనే సర్వే చేయించి కాలేజ్ కి కేటాయించిన స్థలాన్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలని స్థానిక తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ ను ఆదేశించారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పలకరిస్తానని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, టీజీ ఎంఎస్‌ఐడీసీ ఈ ఈ వేణుగోపాల్, డీ ఈ కృష్ణ మూర్తి, తహాసిల్దార్ అమరేందర్ కృష్ణ, ఏ ఈ సాయి మురారి తదితరులుపాల్గొన్నారు.