calender_icon.png 6 August, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు ఉంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించండి

05-08-2025 11:55:09 PM

శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల లక్ష్యం 

డి.ఎస్.పి వెంకటేశ్వర్లు

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఎవ్వరికి ఎప్పుడు ఇలాంటి ఆపద వచ్చిన నిర్భయంగా పోలీసులను సంప్రదించెందుకు అవకాశం ఉందని డిఎస్పి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని "ధర్మా పూర్ గ్రామంలో“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత” కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వేంకటేశ్వర్లు గ్రామ ప్రజలు,యువకులు, విద్యార్థులను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు.

స్కూళ్ళు కాలేజీలు గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం కావాలన్నారు. “పోలీసుల ఉనికి మీ భద్రత కోసం" చట్టపరంగా జీవించే వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. “వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టడం సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగించడమే అన్నారు. 

అలాంటి అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో పోలీసులు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. “రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు అన్నివేళలా పోలీసు రికార్డులో ఉంటారని, ఇది జీవితాంతం మచ్చ వారికే కాదు వారి తదనంతరం వారసులకు కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది అని తెలిపారు. ఎన్నికల సమయంలో గందరగోళం సృష్టించే వారిపై కఠిన చర్యలు – బైండోవర్లు తప్పవన్నారు. కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, పాస్‌పోర్ట్, విదేశీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని,

అలాంటి వారికి ఇంటా బయట కనీస మర్యాదలు విలువలు లేకుండా పోతాయన్నారు. మహిళల పట్ల గౌరవం తప్పనిసరి – వేధింపులపై శిక్షలు తీవ్రంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా బాలికలు చదువుకునే వయసులో ప్రేమలు పెళ్ళిళ్ళు అని మోహ వ్యామొహాలకు లోనై చిన్న చిన్న ఆకర్షణలకు గురై విలువైన జీవితాన్ని, భవిష్యత్తును పాడుచేసుకోవద్దని అన్నారు. మహిళలు విధ్యారినులపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే షిటీమ్ కొండంత అండగా ఉంటుందని, సమాచారం ఇచ్చి సహాయం పొందాలన్నారు. బాధిత బాలికలకు మహిళలకు భరోసా, సఖీ సెంటర్ల ద్వారా మానసిక స్థైర్యాన్ని కల్పిస్తున్నామని తెలియజేశారు.

మోసాలకు లొంగకండి:   గాంధీ నాయక్ , సీఐ 

సైబర్ మోసాలకు గురికాకుండా ఆశలకు బలి కాకూడదని సిఐ గాంధీ నాయక్ అన్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురై నష్టపోయినప్పుడు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 సంప్రదించి సహాయం పొందండి అన్నారు.డ్రగ్స్, గంజాయి, మద్యం, పేకాట తో పాటు చెడు వ్యసనాలు  జీవితాలను నాశనం చేస్తాయన్నారు.

డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల తయారీ సరఫరా వినియోగం ఎక్కడైనా జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలకు అలవాటైన బాధితుల వివరాలు తెలియపరచిన యెడల "డీ అడిక్షన్ సెంటర్ల" ద్వారా చికిత్స అందించి తిరిగి మామూలు స్థితికి వచ్చేటట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.