calender_icon.png 6 August, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను నిండా ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం

06-08-2025 12:00:00 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

లక్షేట్టిపేట, ఆగస్టు 5: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను  నిండా ముంచుతుంది అని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. మంగళవారం పట్టణంలోని ఎస్ పీ ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో యూరియా కొరత పేరుతో రైతులను కాం గ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోందన్నారు.

ప్రధానమంత్రి మోదీ హయాంలో రాష్ట్రానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు తెలిపారు. రైతు బంధు ఎంత మంది రైతులకు ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా? అని విమర్శించారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన తెలంగాణలోని ప్రతి రైతు కుటుంబానికి చేరిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లి హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిందని ఏద్దేవా చేశారు. 

అంతకుముందు పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ రుణమాఫీ చేయకపోవడం వలననే రైతుల ఆత్మహత్యలు పెరిగినట్లు వివరించారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభు త్వం విస్మరించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటేశ్వర్ గౌడ్, వేరేబెల్లి రఘునాథ్, గోమాస శ్రీనివాస్,కొమురయ్య, వెంకటేష్ నేత, శ్రీదేవి, హరిగోపాల్, నాగి రెడ్డి, స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.