06-08-2025 06:11:13 PM
నిర్మల్ (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. నిర్మల్ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గౌరవ వేతనం చెల్లించాలని పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విలాస్ లక్ష్మి రేష్మ తదితరులు పాల్గొన్నారు.