06-08-2025 06:26:14 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి (విజయక్రాంతి): పట్టణంలోని వృత్తి విద్యా కళాశాఖ భవన మరమ్మతులకు రూ. 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఇందులో కలెక్టరేట్ నుండి రూ.10 లక్షలు మరో పది లక్షలు ఇంటర్మీడియట్ బోర్డు నుండి మంజూరు అయ్యాయి. మరమ్మతు పనులు దగ్గరుండి పకడ్బందీగా చేయించుకోవాలని, విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. బుధవారం కలెక్టర్ పట్టణంలోని వృత్తి విద్యా కళాశాలను సందర్శించారు.
తరగతి గదులు పరిసరాలు పరిశీలించిన కలెక్టర్ కళాశాలకు అవసరమైన మరమ్మతులు దగ్గరుండి చేయించుకోవాలని ప్రిన్సిపాల్ ను సూచించారు. మరుగుదొడ్లు నిర్మించుకోవడంతో పాటు పరిసరాలకు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల నమోదును అడిగి తెలుసున్నారు. మొదటి సంవత్సరం 544 విద్యార్థులు ఉండగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 350 మంది చదువుకుంటున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ వినోద్ కుమార్ రెడ్డి, లెక్చరర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.