calender_icon.png 6 August, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ప్రవేశపెట్టాలి

06-08-2025 06:36:17 PM

విద్యార్థి సేన ఆధ్వర్యంలో ర్యాలీ..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Kamareddy Government Degree College)లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇప్పటికే అన్ని సదుపాయాలు ఉన్నా, ఇంకా పీజీ కోర్సులు అందుబాటులో లేవు అన్నారు. ఈ విద్యా సంవత్సరం (2025–26) ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రారంభించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నేటి పోటీ ప్రపంచంలో మేనేజ్మెంట్(MBA), కంప్యూటర్ అప్లికేషన్స్(MCA) కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు పెద్ద నగరాలకు వెళ్లి చదవలేని పరిస్థితిలో ఉన్నందున, కామారెడ్డి ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఎంబీఏ, ఎం సి ఏ కోర్సులు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెంటనే స్పందించాలని, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు టి.కే. శివప్రసాద్, శేఖర్, వెంకటేష్, రాహుల్, అంజి, దేవిక, శరణ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.