06-08-2025 06:29:09 PM
గద్దర్ సేవలు చిరస్మరణీయం.. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిసె ప్రభు రాజ్..
సిద్దిపేట: జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా(Siddipet District) కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిసె ప్రభు రాజ్ మాట్లాడుతూ, రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. బుధవారం సార్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. స్వరాష్ట్ర కలల జెండాను, భవిష్యత్ ఎజెండాను ఆయన వదిలిపెట్టలేదన్నారు.
తెలంగాణే శ్వాసగా.. ధ్యాసగా.. లక్ష్యంగా బతికి, కోట్లాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని కొనియాడారు. ఆయన ఓ గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు. గద్దర్ సేవలను స్మరించుకున్నారు. పిడిత ప్రజల విముక్తి కోసం గద్దరన్న జీవితాంతం పొరాడారని గుర్తుచేశారు. అదే విధంగా గద్దర్ పాటలతో ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చేదాంట్లో తన పాత్ర వెలకట్టలేనిదని గుర్తు చేసుకున్నారు. రాజనర్సు, శ్రీహరి యాదవ్, లక్ష్మణ్ , వడ్లకొండ సాయికుమార్, రాములు సార్ ప్రజాసంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.