calender_icon.png 26 December, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం

26-12-2025 12:46:11 AM

ఎస్టీయూటీఎస్ డైరీలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 25: ఒక సమూహంగా ఉంటూ ఐక్యంగా ముందుకు సాగితే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎస్టీయూటీఎస్ జిల్లా శాఖ -డైరీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  జిల్లా అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని, విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సర్వదా కృషి చేస్తూ మహబూబ్ నగర్ ఫస్ట్  అనే నినాదాన్ని ఉపాధ్యాయులు సాకారం చేయడంలో తమ గురుతర బాధ్యత నిర్వర్తించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్ , ప్రధానకార్యదర్శి దామిస్తపురం ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుంకరి వెంకటేశ్వర్లు , జిల్లా ఉపాధ్యక్షులు బింగిదొడ్డి వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేంద్ర కుమార్, దాస్, అనంత్ రెడ్డి , గోపాల్ నాయక్  పాల్గొన్నారు.