calender_icon.png 26 December, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వగ్రామాభివృద్ధికి సహకారం అందిస్తా..

26-12-2025 02:36:21 AM

నార్కోటిక్స్ ఎస్పీ రావుల గిరిధర్

మానకొండూర్, డిసెంబరు 25 (విజయ క్రాంతి): తాను పుట్టిన స్వగ్రామం పాత నుస్తులాపూర్ తో పాటుగా ఇందిరానగర్, రామక్రిష్ణ కాలనీ గ్రామాలకు తనవంతుగా సహకారం అందిస్తూ, అందరి సహకారంతో గ్రామాభివృద్దికి కృషి చేస్తానని నార్కోటిక్స్ ఎస్పీ (ఈగల్ టీం) రావుల గిరిధర్ తెలిపారు. తన సతీమణి చైల్ రైట్స్ కమీషన్ మెంబర్ అపర్ణ తో కలిసి నుస్తులాపూర్ రెవెన్యూ గ్రామం రామకృష్ణకాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని అనంతపద్మనాభస్వామి ఆలయ స్థలాన్ని, అసంపూర్తిగా ఉన్న ఆలయ నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ గుజ్జుల శ్వేత, నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఆలయ స్థలంలో అనంతపద్మనాభ స్వామి ఆలయ నిర్మాణానికి దాతల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. నుస్తులాపూర్, రామకృష్ణకాలనీ గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు రావుల రమేష్, గుజ్జుల రవీంధర రెడ్డి, కిన్నెర సారయ్య, నాయకులు సుగుర్తి జగదీశ్వరా చారి, కొమ్మెర మల్లారెడ్డి, దావు సంపత్ రెడ్డి, రావుల జీవన్, వేల్పుల ఓదయ్య, దావు శ్రీనివాస రెడ్డి, ఎదులాపురం సత్యం, నూనె సురేష్, వంగాల శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, బాలస్వామి, శేఖర్ రెడ్డి, బోళ్ల శంకర్, తదితరులు పాల్గొన్నారు.