26-12-2025 12:45:07 AM
డీఎస్పీ వెంకట్‌రెడ్డి
చారకొండ, డిసెంబర్ 25: విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం మండల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి న్యాయం చేయాలన్నారు.
గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిరంతరం నిఘా పెట్టాలన్నారు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుళ్లు సురేష్ గౌడ్, ఎ. ప్రశాంత్ కు డీఎస్పీ రివార్డు అందజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్త్స్ర వీరబాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.