01-09-2025 12:50:08 AM
రజక సంఘం అధ్యక్షులు దుర్గేష్
మహబూబ్ నగర్ రూరల్ ఆగస్టు 31: ఐక్యతతోనే మన అందరి అభివృద్ధి సాధ్యమవుతుందని రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గేష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోనీ పద్మావతి కాలనీ పార్కులో రజక సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కారం దిశగా ముందుకు తీసుకుపోయేందుకు ఎమ్మెల్యేలను కలిసి సమస్యను వివరిద్దామని పిలుపునిచ్చారు.
రజకులకు అందించాల్సిన పథకాలను పూర్తిస్థాయిలో అందించి వారు ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని కోరారు. అందరం ఐక్యంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నేతలు భరత్ కుమార్,ఎల్బీ నరసింహ, మల్లేష్, పాండు, మహేష్, సాయిలు, రవి, వెంకటయ్య , వెంకటేష్ , కిషోర్, రమేష్, గంగన్న, కృష్ణ, మనోహర్ తదితరులు ఉన్నారు.