01-09-2025 12:52:09 AM
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
మహబూబ్ నగర్ అర్బన్ ఆగస్టు 31 : రక్తదానం చేయడం మానవతకు దర్పణమని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కా ర్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొ త్వాల్ అన్నారు.
మిలాదున్నబీ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్లోని ఫలక్ నుమాలో ఆదివారం జరిగిన యా రహమతుల్ లిల్ ఆలమీన్ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి బజ్మే ఖద్రియా కాజ్మీయా జిల్లా అధ్యక్షుడు జహంగీర్ పాష ఖాద్రీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం నుంచి వెళ్లే ప్రత్యేక బస్సును స్థానిక అబ్దుల్ ఖాదర్ దర్గా ఎదుట రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ జెండా ఊపి ప్రారంభించారు.
కొత్వాల్ మాట్లాడుతూ ప్రతి ఏడాది మిలాదున్నబీ వేడుకల సందర్భంగా భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమని అన్నారు. మనం చేసే రక్తదాన శిబిరం ప్రాణపాయాస్థితిలో ఉన్న మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. జిల్లా కేంద్రం నుంచి వందలాది మంది రక్తదానం చేయడానికి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా కొత్వాల్ బజ్మే ఖాద్రియ కాజ్మియ జిల్లా అధ్యక్షుడు జహంగీర్ పాష ఖాద్రీని అభినందించారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హాదీ, ప్రధాన కార్యదర్శి జాకీర్ అడ్వకేట్, సాదతుల్లా హుస్సేని, ఉమర్ కొత్వాల్, మీర్ షోయట్‌అలీ, జమీర్ ఖాద్రీ, గులాం అహ్మద్ జహీర్ తదితరులు పాల్గొన్నారు.