01-09-2025 12:48:42 AM
కల్వకుర్తి: ఆగస్టు 31 : పట్టణంలోని పాలమూరు కూడలిలో ఆదివారం భారతీయ జనతా పార్టీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కు టుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బిజె పి పట్టణ అధ్యక్షుడు బాబిదేవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్,జిల్లా ఉపాధ్యక్షుడు బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి గుర్రాల రాంభూపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నరెడ్ల శేఖర్ రెడ్డి, పాలకూర్ల రవి గౌడ్, చందు ము దిరాజ్, పానుగంటి శివ కుమార్, తగుల వెంకటేష్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, వాకిటి శ్రీకాంత్, లక్ష్మీ నరసింహ తదితరులుపాల్గొన్నారు.