12-01-2026 12:00:00 AM
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ప్రజల మధ్యలో ఉన్న వారు ఎవరైనా గెలుపును వరిస్తారు
ఎంపీ ఈటల రాజేందర్
కురుమ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఘన సన్మానం
ముషీరాబాద్, జనవరి11 (విజయక్రాంతి): కురుమలు ఐక్యంగా ఉండి రాజకీ యాల్లోకి రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా గెలిచిన కుర్మ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2026- నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షుడు వెంకటేష్, శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ గవర్నర్ బం డారు దత్తాత్రేయ మాట్లాడుతూ విద్యలు రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ముఖ్యంగా కురుమ సంఘాల ఆధ్వర్యంలో వసతి గృహాలను ఏర్పాటు చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి వారి కి విద్యను అందించేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎంపీగా గెలవడం కంటే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా గెలవడమే నిజమైన ప్రతిభా అని అన్నారు. ఏ సంఘాలలోనే యువత ఎంతో ముఖ్యమని వారు ఏ విషయంలో నూ రాజీ పడకుండా వాస్తవికంగా ముం దుంటాన్నారు.
ప్రజల మధ్యలో ఉన్న వారు ఎవరైనా గెలుపును వరిస్తుందని అన్నారు. గెలుపు అనేది మన తప్పుల్ని కప్పిపుచ్చుతే, ఓటమి మన తప్పుల్ని బయట పెడతాయ న్నారు. అయినప్పటికీని అధైర్య పడకుండా గెలుపు కోసం ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ అక్షరాలను 40 సెకండ్లలో చదివి గిన్నిస్ బుక్ రికార్డు చోటు సంపాదించుకున్న అందే కిరణ్ కుమార్ ను శాలువాలు మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్‌లు తుల ఉమ, సరిత, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, కురుమ చైతన్య సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.