12-01-2026 12:00:00 AM
హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి. రాధారాణి
ముషీరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): ఆయా దేశాలలోని చమురు వనరులు, డాలర్లపైన అగ్రరాజ్యాల ఆధిపత్యం, నియంతృత్వం కొనసాగదని, దీనికి వ్యతిరేకంగా చిన్న దేశాలన్నీ ఏకమవ్వాల్సిన అసవ రం ఎంతైనా ఉందని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్, హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి. రాధారాణి అన్నారు. సహజ వనరులు, డాలర్లపైన ప్రజలదే పెత్తనమని, ప్రైవేటు, అగ్రరా జ్యాలకు పెత్తనం లేదని స్పష్టం చేశారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సం ఘం (ఇస్కఫ్) తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ టూరిజం ప్లాజాలో ఆదివారం జరిగింది.
ఈ సదస్సుకు ఇస్కఫ్ రిసిప్షెన్ కమిటీ అధ్యక్షుడు, హైకోర్ట్ న్యాయవాది కడారు ప్రభాకర్ రావు అధ్యక్షత వహించారు. జస్టిస్ జి. రాధారాణి ముఖ్యఅతిథాగా హాజరవ్వగా, ఇస్కఫ్ నేషనల్ ప్రీసిడియం మెంబర్, మాజీ ఎంపి సయ్యద్ అజీజ్ పాషా సదస్సు ప్రారంభోపన్యాసం చేశారు. ఆర్టిఏ మాజీ జాయింట్ కమిషనర్ సి.ఎల్.ఎన్. గాంధీ హాజరయ్యా రు. ఈ సదస్సులో మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, సిఎల్ గాంధీ, కడారి ప్రభాకర్లు, ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. గోపాల్, ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజశేఖర్, న్యాయవాది బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.