calender_icon.png 7 August, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలి

07-08-2025 01:03:48 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, ఆగస్టు 6 (విజయక్రాంతి): జిల్లాలో సి.ఎస్.ఆర్. నిధుల కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో నీటిపారుదల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మున్సిపల్, మిషన్ భగీరథ, రోడ్లు - భవనా లు, పంచాయతీ, టిజిఎంఎస్‌ఐడిసి, సింగరేణి (సివిల్) శాఖల అధికారులు, ఎంపీ డీవోలతో అభివృద్ధి పనుల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

సి.ఎస్.ఆర్. (కార్పొరేట్ సోష ల్ రెస్పాన్ష్ బులిటి) నిధుల కింద సింగరేణికి సంబంధించి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. మురుగు కాలువలు, రహదారులు, చెరువు పూడికలు, ఓపెన్ జిమ్, వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్స్ తదితర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి సకాలంలో బిల్లులు సమర్పించాలన్నారు. అనంతరం అభివృద్ధి పనుల వారిగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి పూర్ణచందర్రావు, సింగరేణి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.