07-08-2025 01:01:57 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్
నిర్మల్, ఆగస్టు ౬ (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ కాం గ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నా వెనుక పెద్దకుట్ర ఉందని బీసీల పేరుతో మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసానికి పాల్పడుతుందని బిజెపి జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆరోపించారు బుధవారం పార్టీ కార్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమస్యలు మాట్లాడారు.
42 శాతం బీసీల రిజర్వేషన్ల పేరుతో మైనార్టీలకు 10 శాతం పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ పిసి రిజర్వేషన్ ముందుకు తీసుకు వచ్చిందని తెలిపారు. బీసీలపై ప్రేమ ఉంటే ఆ పార్టీ ప్రధానమంత్రి సీఎం అభ్యర్థులను బీసీలు ఉన్నవారికి ఇవ్వాలని ప్రకటిస్తారని సూటిగా ప్రశ్నించారు. బీసీలకు బిజెపి వ్యతిరేకం కాద ని, ప్రధాని బీసీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు పిలుపుని చ్చారు.
ఇటీవలి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా లో నిర్వహించిన పాదయాత్ర వల్ల జనానికి ఒరిగింది ఏమీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పాదయాత్ర నిర్వహించినట్టుగా ఉందని రితీష్ రాథోడ్ ఆరోపించారు.
కేం ద్రం ఇచ్చే నిధులతో అభివృద్ధి చేసుకున్న కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వంపై నిందలు వేస్తే ప్రజలు క్షమించరని రాబోయే ఎన్నికల్లో ఆపాటికి గుణపాఠం చెప్తారని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఐఎన్‌ఆర్ భూమయ్య రావుల రామ నాథ్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.