calender_icon.png 6 August, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

14-05-2025 11:33:23 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 16న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) జిల్లా పర్యటన నేపథ్యంలో కుంటాల మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav), ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ అవినాష్ కుమార్‌లతో కలిసి పరిశీలించారు. మంత్రి పర్యటన సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులతో సమీక్షించి, తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.