calender_icon.png 1 December, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డేపల్లిని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ఉంచుతా

01-12-2025 06:09:47 PM

* ప్రతి కాలనీలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి

* పదేళ్ల పాలకుల ఇంటి చుట్టూ ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి పనులు

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి ప్రతికాలనీలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వడ్డేపల్లి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 60వ డివిజన్ వడ్డేపల్లి ముదిరాజ్ కాలనీ, ముస్లిం కాలనీ, మిడిదొడ్డి వాడ అలాగే ఎస్బిహెచ్ బ్యాంక్ కాలనీలో సుమారు 1.65 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, సీసీ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, పూర్తి అయినా సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆయా కాలనీలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే నాయిని, స్థానిక ప్రజలను, కాలనీ పెద్దలను మమేకం చేస్తూ పర్యటన చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి పనుల్లో ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ముఖ్యమైన ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల సహాయ సహకారాలు అవసరమని కొద్దిపాటి ఓర్పుకు అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయని గుర్తు చేశారు. ఇప్పటికే 70-80 శాతం మేర పనులు పూర్తయ్యాయని రానున్న రోజులలో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

పదేళ్లు అధికారంలో ఉండి వడ్డేపల్లిలో కనీస అభివృద్ధి పనులు చేయకపోవడం వారి అసమర్థతకు నిదర్శనం అని ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన అనతికాలంలోనే మాజీ ప్రతినిధుల కాలనీలను సైతం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు ఎనుకొంటి పున్నం చందర్, తాళ్ల పెళ్లి సుధాకర్, కాంగ్రెస్ శ్రేణులు ఎండి నేహాల్, మండల సమ్మయ్య, శివకుమార్, తాళ్లపల్లి రవీందర్, మేరీ, తాళ్ల పెళ్లి విజయ్, జనగాం శ్రీనివాస్, బుస్సా నవీన్ కుమార్, పిట్టల వంశీ, కమల్, సాజిద్, అక్మల్, యుగంధర్, బిజెపి నాయకులు రోకుల సతీష్, రామ్ రాజ్, నాగపురి అశోక్, యాదగిరి, అధికారులు, కాలని పెద్దలు తదితరులు పాల్గొన్నారు.