calender_icon.png 1 December, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడ రూరల్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

01-12-2025 06:21:42 PM

కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు గుడ్ల మైసయ్య సుమారు 20 మందితో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వాకులభరణం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సొయినేని కర్ణాకర్, గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం మల్లేశం, గంగ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.