calender_icon.png 1 December, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి..

01-12-2025 06:36:22 PM

డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్..

బేల (విజయక్రాంతి): అందరు కలిసి కట్టుగా శ్రమించి మండలంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలుపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ కోరారు. బేల మండల కేంద్రంలో సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండవార్ ఆధ్వర్యంలో నూతన డీసీసీ అధ్యక్షుడుని ఘనంగా సన్మనించారు.

బేల గ్రామానికి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్బంగా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అములు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికీ సమూచిత స్థానం దక్కుతుందని అన్నారు. ఈ సమావేశంలో జైనథ్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అశోక్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షులు సాజీద్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ రెడ్డి పలువురు పాల్గొన్నారు.