01-12-2025 06:30:30 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బస్తీలలో చెత్తను కాల్చడం చేయకూడదని తడి, పొడి చెత్తను వేరుచేయాలని, నీటిని పొదుపుగా వాడాలని, చెట్లను నాటి వాటిని సంరక్షించాలని, ప్లాస్టిక్ బదులుగా బట్ట సంచులను వాడాలని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు, ఆచార్యులు సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రముఖ్ ఉడుతల శ్రీలక్ష్మి, సైదం శ్రీ రాం, సత్యనారాయణ, శ్రీకాంత్, బిళ్ళ అనూష, ఆత్రం కిరణ్, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.