calender_icon.png 1 December, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీప్నెల్లి తండా సర్పంచ్ స్థానం ఏకగ్రీవం..

01-12-2025 06:25:44 PM

తానూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా తానూర్ మండలం హీప్నెల్లి తండా గ్రామ పంచాయితి ఎన్నికల్లో సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం తండావాసులు సమావేశమై మూడో విడత జరిగే ఎన్నికల్లో గ్రామానికి చెందిన సంతోషం ఏకగ్రీవ అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు సమావేశమై, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కలసి గ్రామాన్ని చాలావరకు అభివృద్ధి చేస్తారని నమ్మకం కలిగిన రాథోడ్ సంతోష్ ధన్ను అను అభ్యర్థిని ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవంగా ఎన్నుకొవ్వడం జరిగింది. ఈ నిర్ణయం గ్రామంలో చర్చనీయాంశమైంది. సంతోష్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసేలా గ్రామస్తులు తీర్మానం చేశారు.