01-12-2025 06:12:27 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): ఈ నెలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ నాయకులతో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సోమవారం తన నివాసంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించిన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులందరూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలని ప్రతీ ఒక్క కార్యకర్త సమన్వయంతో కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామగ్రామాన వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలని అలాగే ప్రతిపక్షాలు అవలంబించే తీరును ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుపుతూ చైతన్యంగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కోసం కట్టుదిట్టంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ ,సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మార్కెట్ డైరక్టర్లు, పలువురు పాల్గొన్నారు.