01-12-2025 06:39:22 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఇల్లందు పోలీసులు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి సుల్తానాను ముందస్తు అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అబ్దుల్ నబీ, మండల పార్టీ కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్ లు ఖండించారు. ముఖ్య మంత్రి పర్యటన కొత్తగూడెంలో ఉంటే ఇల్లందు సీఐటీయూ జిల్లా నాయకురాలును అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి పర్యటన నేపద్యంలో అరెస్టు చేయడం సరికాదన్నారు. నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు అపలేరన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావులున్నారు.