18-12-2025 01:37:16 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్, డిసెంబర్ 17(విజయక్రాంతి): అందరూ ఆర్థికంగా ఎదగాలన్నదే తమ సంకల్పమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి గుంతలు, గతుకులతో ప్రమాదకరంగా మారిందని ప్రజల నుంచి వినతులు అందాయని, ఆ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రాంతానికి చేరుకుని స్థానిక మాజీ మున్సిపల్ కౌన్సిలర్తో కలిసి బ్రిడ్జిని పరిశీలించారు.
రోడ్డు పూర్తిగా దెబ్బతినడం వల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ఎమ్మెల్యే గారు, ఆర్ అండ్ బి పనులు చేసే ఇంజనీర్స్ తోటి పనులకు ఎస్టిమేట్స్ తయారు చేసి, వారం రోజుల్లోగా మరమ్మత్తు పనులు ప్రారంభించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను ఆదేశించారు. అలాగే స్వామి వివేకానంద మహిళా సంఘం భవనాన్ని పునరుద్ధరించి, మహిళా సంఘ భవనం పైభాగంలో విద్యార్థుల కోసం ఆధునిక గ్రంథాలయం,స్టడీ రూం ఏర్పాటు కోసం ఎస్టిమేట్స్ తయారు చేయాలని ఎమ్మెల్యే గారు కమీషనర్ ని ఆదేశించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెరుగైన చదువు వాతావరణం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామకృష్ణ, నాయకులు అద్దీస్ , మహమ్మూద్ రియాజుద్దీన్, చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.