18-12-2025 01:35:46 AM
జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, డిసెంబర్ 17 ( విజయక్రాంతి ) : ఓటర్లు నిర్భయంగా తమ అమూల్యమైన ఓటును ప్రశాంతంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
బుధవారం వనపర్తి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా శ్రీరంగాపురం మండల పరిధిలోని వెంకటాపురంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం, శ్రీరంగాపురం మండల కేంద్రం లోని జిల్లా పరిషద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం, పెబ్బేరు మండలంలోని కంచిరావు పల్లి గ్రామపంచాయతిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియ, ఏర్పాట్లను పరిశీలించారు.
జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఐదు మండలాల్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఓటర్లు నిర్భయంగా తమ అమూల్యమైన ఓటును ప్రశాంతంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలను పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.