03-01-2026 12:00:00 AM
తూప్రాన్, జనవరి 2 : తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గల 16 వార్డులలో పలు అభివృధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నగర అభివృద్ధి కింద రూ.15 కోట్లు మంజూరు కాగా ఒక్కొక్క వార్డు చొప్పున రూ.50 లక్షలతో 8 కోట్ల అభివృద్ధి పనులకు కమీషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తూముకుంట నర్సారెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మామిండ్ల జ్యోతికృష్ణ, మాజీ వైస్ ఛైర్మన్, మాజీ వార్డు కౌన్సిలర్స్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.