03-01-2026 12:00:00 AM
మేడారాన్ని పునర్నిర్మాణం చేస్తున్న మంత్రి సీతక్క
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య
మంగపేట, జనవరి 2 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో మీడియా సమావేశంలో బిఅర్‌ఎస్ నాయకురాలు జోతక్క మాట్లాడిన మాటలు సరికాదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య అన్నారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేలగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరను చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజా ప్రభుత్వం 220 కోట్ల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీతో జాతర పనులను రాష్ట్ర మంత్రి సీతక్క పర్యవేక్షణలో ఎక్కడ కుడా అవినీతి జరగకుండా జిల్లా అధికార యంత్రాంగంతో నిత్యం పర్యవేక్షణ చేస్తూ అధికారులతో సమన్వయము చేస్తూ పనులను చేపిస్తుంటే,కొందరు నాయకులు అభివృద్ధినీ చూసి ఓర్వలేక తప్పుగా మాట్లాడటం బాధాకరం మీ ప్రభుత్వంలో కమిషన్ ల కోసం కక్కుర్తిపడి వ్యవస్థను నాశనం చేశారు.
కనుకనే బిఅర్‌ఎస్ ప్రభుత్వంను గద్దె దీంపి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు అనేది మరిచిపోయరా, మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో 152 స్థానాలకు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 124 స్థానాలలో గెలుపొందారూ కేవలం 28 స్థానాలలో బిఆర్‌ఎస్ గెలిచింది అంటే మీరు చెప్పినట్టుగా చిల్లర కామెంట్స్ చేస్తే జనం నమ్మరు జోతమ్మ జనంలో నిత్యం ఉండే నాయకురాలు మా సీతక్క ప్రజా ప్రభుత్వం చేస్తున్నావ్ అభివృద్ధి సంక్షేమ పధకాలతో ప్రజా సంక్షేమo కోసం పని చేసేది ప్రజా ప్రభుత్వం అని, అదేవిధంగా మీరు చెప్పినట్లు నాసిరకంగా పనులు చేసింది కమిషన్ ల కోసం కక్కుర్తి పడింది మీ ప్రభుత్వంలో అని ప్రజలకు తెలుసనీ వివరించారు.