15-09-2025 12:55:10 AM
ఇటీవల ‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్నారు స్టార్ హీరో ధనుష్. ఆయన కథానాయకుడిగా తమిళంలో ప్రస్తుతం రూపొందుతున్న చిత్రం ‘ఇడ్లీకడై’. ధనుష్ స్వీయ దర్శకత్వంలో, తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కు ఇది నాలుగో సినిమా. ఇందులో నిత్యామీనన్ కథానాయికగా నటిస్తుండగా.. అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రం తెలుగు, తమిళ్ లో ఒకేసారి అక్టోబర్ 1న విడుదల కానుంది. అయితే, తెలుగులో ‘ఇడ్లీకొట్టు’ పేరుతో రానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ వేదాక్షర మూవీస్ దక్కించుకుంది. ఈ మేరకు శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ అధినేత నిర్మాత రామారావు చింతపల్లి అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్‌ష్మ డీవోపీ: కిరణ్ కౌశిక్, యాక్షన్: పీటర్ హెయిన్‌ష్మ ఎడిటర్: ప్రసన్న జీకే్ష్మ ఆర్ట్: జాకీ.