05-07-2025 07:13:46 PM
చేర్యాల: పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొమురవెల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి లెనిన్ రాజ్ మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అదేవిధంగా జాప్యం చేస్తుందని విమర్శించారు. వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో పెట్టడం అంటే పేద విద్యార్థులను చదువులకు దూరం చేయడమేనని ఆయన ఆరోపించారు. లేని పక్షంలో విద్యార్థులను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చందు, భరత్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.