calender_icon.png 23 July, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమాత చట్టాన్ని ఆమోదించాలని ధర్నా

13-12-2024 02:12:33 AM

ఖమ్మం, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం భూమాత చట్టాన్ని వెంటనే ఆమోదించి, ప్రజాపాలనలో వచ్చిన భూ దరఖాస్తులను విచారించి, రైతులకు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు ఖమ్మంలోని అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వారు మాట్లాడుతూ.. ఏడాది నుంచి రైతులు పాస్‌పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే భూమాత చట్టాన్ని ఆమోదించేలా చొరవ తీసుకోవాలన్నారు. ముసా యిదాలోని లోపాలను సరి చేయాలన్నారు. నకిలీ విత్తన వ్యాపారులపై  ఉక్కుపాదం మో పి, రైతులను కాపాడాలన్నారు. రైతు ఆత్మహత్యలకు నివారణ, కౌలుదారుల చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు. అఖిల పక్ష సమావేశాలు నిర్వహించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం  డిప్యూటీ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సంఘం నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, కె.గౌషియా, తాటికొండ శ్రీనివాసరావు, మీరా, షేక్  పడగల్ నాగేశ్వరరావు, బత్తిని ఉపేందర్ పాల్గొన్నారు