13-12-2024 02:09:51 AM
హైదరాబాద్, డిసెంబర్ 12(విజయక్రాంతి): తిరుమల, తిరుపతిలో గురువారం భారీ వర్షం కురిసింది. ఈక్రమంలో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమా దం ఉన్నందున భక్తులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కాగా పాపవినాశనం, గోగర్భం పూర్తిగా నిండి ప్రవహిస్తుండటంతో ఆ దారులను తాత్కాలికంగా మూసివేశారు.
తిరుపతిలోనూ వర్షం దంచికొట్టడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంటలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరింది. వెస్ట్ చర్చి కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు వరద చేరడంతో అధికారులు వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. మాల్వాడిగుండం జలపాతం పొర్లుతున్నది. కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా భక్తులను అధికారులు నిలిపివేశారు.