14-10-2025 05:31:13 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దళిత హక్కుల పోరాట సమితి(డిహెచ్పిఎస్) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ పై దాడి చెయ్యడానికి సిద్దపడటం సరికాదని ఆందోళనకారులు మండిపడ్డారు. ఈ దాడినీ సనాతనంతో ముడిపెట్టడం దివాలు కోరు రాజకీయమని, దాడి చేసిన రాకేష్ కిషోర్ ను నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి శ్రీధర్, దేవి పోచన్న మాట్లాడుతూ.. హిందూ మతానికి తప్పుడు అర్ధం ఇచ్చిన చిన్నజీయర్ ను ఏమనలేదని, ఎందుకంటె అయిన బ్రాహ్మణుడని, అదే బ్రాహ్మణుడుపై ఇలాంటి దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక దళిత బిడ్డ ఉన్నత స్థానంలో కూర్చోవడం సహించలేని ఆధిపత్య కుల దురహంకారమే ఆ రాకేష్ కిషోర్ ను ఉసిగొలిపిందన్నారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం తిలక్ అంబేద్కర్, నాయకులు కుంట ప్రకాష్, కామెరా శ్రీనివాస్, రెడ్డి సారయ్య, దేవికిరణ్ లాల్, సదాలక్ష్మి, మహేష్, సందీప్, రాజేందర్, సంపత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.