calender_icon.png 14 October, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ వర్షం..

14-10-2025 05:23:03 PM

తడిసిన ధాన్యం..

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దయింది. కాగా మంగళవారం మధ్యాహ్నం ఎండ కాస్తుండగా మబ్బులు లేకుండా ఒక్కసారిగా ఐదు నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో మార్కెట్ యార్డ్ లోని సీసీ ప్లాట్ ఫామ్ పై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోగా కొంతమంది రైతుల ధాన్యం వరద నీటికి కొట్టుకపోయింది. మొన్నటి భారీ వర్షం నుండి చేరుకునే లోపే మరొకసారి వర్షం రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.