14-10-2025 05:33:57 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. మంగళవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో రైతు వేదిక ప్రాంగణంలో(ఎన్.ఎం.ఈ.ఓ) జాతీయ నూనె గింజల ఉత్పత్తి ప్రోత్సాహక పథకంలో భాగంగా ఐటి పాముల క్లస్టర్ పరిధిలోని కట్టంగూర్ ఎఫ్.పి.ఓ రైతు సోదరులకు రైతులకు 100% సబ్సిడీపై వేరుశనగ(GJG 32) విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తామంజుల మాధవరెడ్డి, నకిరేకల్ ఏడిఏ ఎండి జానీమియా, తహశీల్దార్ పుష్పలత ఎపిఓ కండెం రాంమోహన్, ఏఈఓలు రమణ, పరశురాం, నవీన్, ప్రజాప్రతినిధులు మాద యాదగిరి, సుంకరబోయిన నరసింహ, నాయకులు పెద్ద సుక్కయ్య ఏప్పిఓ చైర్మన్ చౌవుగోని సైదమ్మ, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.