01-02-2025 12:00:00 AM
ఎత్తున భవనాలు, వంతెనలు, కొండలపైకి ఎక్కి కిందకి చూసినప్పుడు.. మీకు భయం కలిగితే దాన్ని ‘ఎక్రోఫోబియా’ అని అంటారు.
నోమోఫోబియా ఉన్నవారు తమ మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేరు. ఈ ఫోబియా ఉన్నవారు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఛార్జింగ్(లేదా) సిగ్నల్ లేకున్నా తెగ ఆందోళన చెందుతారు.
అరిత్మోఫోబియా అంటే సంఖ్యలకు భయపడటం. వీరు సంఖ్యలను చూడటానికి, గణిత సమస్యలు చేయడానికి చాలా భయపడతారు.
చిన్న సందులు, ఇరుకైన ప్రదేశాలను చూసి అందులో చిక్కుకుంటామేమో అని భయపడితే వారికి క్లాస్ట్రోఫోబియా ఉన్నట్టు.
సూదులకు భయపడటాన్ని అట్రాఫోబియా.. గుర్రాలను చూసి బెదరడాన్ని ఎక్వినిఫోబియా అని అంటారు.