10-05-2025 03:17:40 AM
న్యూఢిల్లీ, మే 9: భారత్- పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నందున.. మున్ముందు గ్యాస్‌సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన నిల్వలు ఉండవేమోననే ఆందోళన యావత్ దేశంలో నెలకొన్నది. ముఖ్యంగా పాక్ టార్గెట్ చేసి గురువారం రాత్రి డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిన ప్రాంతాల్లో ఈ ఆందోళన మరీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) కీలకమైన ప్రకటన విడుదల చేసింది.
తమ సంస్థ పరిధిలోని అన్ని అవుట్‌లెట్లు, ఫిల్లింగ్ స్టేషన్లలో ఎలాంటి ఇంధన వనరుల కొరత లేదని స్పష్టం చేసింది. వినియోగదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. దయచేసి పెట్రోల్ బంకుల వద్ద ఎగవబడవద్దని, కొన్నిసార్లు అది ఉద్రిక్తతలకు దారి తీయవచ్చని హెచ్చరించింది.