calender_icon.png 10 May, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ భద్రత విషయంలో రాజీ లేదు!

10-05-2025 03:20:33 AM

  1. పాక్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాం..
  2. భారత సైన్యం స్పందించిన తీరు అమోఘం
  3. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

న్యూఢిల్లీ, మే 9: దేశభద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడమని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎలాంటి హద్దులు పెట్టుకోబోమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో శుక్రవా రం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేం ద్ర ద్వివేది, ఎయిర్‌ఫోర్స్ మార్షల్ ఏపీ సిం గ్, నేవీ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠితో నిర్వహించిన నేషనల్ కాన్‌క్లేవ్ సమీక్షలో ఆయన మాట్లాడారు.

పాక్ దాడులను ఉపేక్షించేది లేదని, ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడతామని తెలిపారు. పాక్ తమ సహనాన్ని పరీ క్షించాలనుకుంటే, అందుకు దీటుగా సమాధానం చెప్తామని హెచ్చరికలు జారీ చేశారు. పాక్ దాడులను భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టిందని కొనియా డారు. ఎ లాంటి ప్రాణనష్టం లేకుండా, పౌరులకు హా ని లేకుండా పనిచేసిన తీరు తనను అబ్బురపరిచిందన్నారు. నియంత్రణ రేఖ వద్ద మ రింత నిఘా పెంచుతామని స్పష్టం చేశారు.