10-05-2025 03:23:01 AM
ఏర్పాటు చేయాలని సీఎండీలకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): ఇప్పటివరకు కేవలం ఉమ్మడి జిల్లా కేంద్రా ల్లో మాత్రమే అందుబాటులో ఉన్న విద్యుత్ సామగ్రి స్టోర్‌లను, రాష్ట్రంలోని ప్రతి నూత న జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు చేయాలని సీఎండీలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో రాష్ర్ట విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యుత్ సంస్థల సీఎండీలు రానున్న ఐదేళ్లలో నమోదయ్యే డిమాండ్ అంచనాలు, దానికి తగ్గట్టుగా సంస్థలు చేపట్టబోతున్న కార్యాచరణపై నివేదికలు ప్రవేశ పెట్టారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, దక్షిణ పంపిణీ సంస్థ, రెడ్ కో ప్రస్తుత కెపాసిటీ 20,883 మెగావాట్లు, మొత్తం కాంట్రాక్ట్ కెపాసిటీతో కలిపి 26,183 మెగావాట్లుగా ఉన్నదని విద్యుత్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచాన ప్రకారం 2030 నాటికి 24,215 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుతుందని, ఈ డిమాండ్ ఎదుర్కొనేందుకు సింగరేణి, జెన్‌కో వంటి విద్యుత్ ఉత్పాదన సంస్థలు తీసుకుంటున్న చర్యలను నివేదించారు. 2024తో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట డిమాండ్ 9.8 శాతం పెరిగిందని ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్ తెలిపారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో గతేడాది 9,862 మెగావాట్లుగా ఉన్న గరిష్ట డిమాండ్, ఈ ఏడాది 10.48 శాతం పెరుగుదలతో 11,017 మెగావాట్లకు పెరిగిందని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ స్పష్టం చేశారు.
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో గతేడాది 5816 మెగావాట్లుగా వున్న గరిష్ట డిమాండ్ ఈ ఏడాది 6281 మెగావాట్లకు పెరిగిందని సీఎండీ వరుణ్‌రెడ్డి తెలిపారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టం పలు అంతర్జాతీ య సంస్థలకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసె స్, ఫార్మాస్యూటికల్, మాన్యుఫాక్చరింగ్ సంస్థలు తమ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరిస్తున్నాయని చెప్పారు. గతేడాది తో పోల్చుకుంటే గరిష్ట డిమాండ్ దాదాపు 10 శాతం పెరిగినా సరఫరాలో ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా విద్యుత్ వుద్యోగులందరూ కృషి చేస్తున్నారని అభినందించారు.