09-09-2025 03:01:51 PM
అనంతగిరి: శిధిలావస్థకు చెరిన ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియక క్షణక్షణం భయం భయంగా కాలం వెలదీస్తున్నానని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) దయవుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అనంతగిరి మండలం (Anantagiri Mandal)అమీనాబాద్ గ్రామానికి చెందిన దేవపంగు ధనమ్మ కోరుతున్నారు...మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయ భూమి ఏమీ లేదు కూలి చేసుకొని జీవితం వెల్లదీస్తున్న ఉన్న ఇల్లు పూర్తిగా పెచ్చులు ఊడి ప్రమాదకరంగా మారింది.
గట్టిగా వర్షం వస్తే కూలిపోతుందేమోనని భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాం ఈ ఇంట్లో 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాం ప్రస్తుతం ఇల్లు శిధిలావస్థలో చేరింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవన ప్రయాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నప్పటికీ... మా బతుకులు మారడం లేదని ధనమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా గ్రామ నాయకులు అధికారులు కోదాడ శాసనసభ్యులు చొరవ తీసుకొని మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.