calender_icon.png 23 August, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంతలో పడి వికలాంగ యువకునికి గాయాలు

21-09-2024 02:39:34 PM

అంకుశం గ్రామానికి వెళ్లే రహదారిపై గుంతలు ఏర్పడ్డ దృశ్యం

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామానికి వెళ్లే అప్రోచ్ రోడ్లో ఏర్పడ్డ గుంతల్లో పడి లింగదరి గూడెం గ్రామానికి చెందిన ముంజం నీ మాజీ అనే వికలాంగుడికి గాయాలయ్యాయి. బోయపల్లి బోర్డు నుండి అంకుశం లింగదరిగుడా, తాండూరు మండలంలోని చౌటపల్లి పోచంపల్లి దుబ్బగూడ గ్రామాలకు నేషనల్ హైవే అధికారులు అప్రోచ్ రోడ్డు వేయకపోవడంతో రోడ్డు గుంతల మయంగా మారి తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తమ ఇబ్బందులు నేషనల్ హైవే అధికారులకు విన్నవించిన వారు పట్టించుకోవడంలేదని మండల సిపిఐ కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ తెలిపారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు బోయపల్లి బోర్డ్ నుండి ఈ గ్రామాలకు అప్రోచ్ రోడ్డును నిర్మించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆయన కోరారు.