calender_icon.png 16 November, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాలూ కుటుంబంలో విభేదాలు.. రోహిణి ఆచార్య ఆస్తి ఎంతో తెలుసా..

16-11-2025 04:11:59 PM

పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆదివారం తనను అవమానించారని, శారీరకంగా బెదిరించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓటమి జరిగిన 24 గంటల్లోనే జరిగిన పరిణామాలు లాలూ యాదవ్ కుటుంబంలో రాజకీయ తుఫానును సృష్టించాయి. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య అకస్మాత్తుగా వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది. తేజస్వి యాదవ్, ఆయన సలహాదారు సంజయ్ యాదవ్, రమీజ్ లపై రోహిణి చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది.

ఒక వివాహిత మహిళ, ఒక తల్లిని ఆమె పిల్లల ముందు దుర్భాషలాడి, చెప్పులతో కొట్టారని రోహిణి తన సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ పట్టింది. రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. లాలూ కుటుంబంతో, ఆర్జేడితో తనకు ఎటువంటి సంబంధాలు లేవని వెల్లడించారు. రాజకీయ గందరగోళం మధ్య రోహిణి ఆచార్య నికర విలువ కూడా చర్చనీయాంశంగా మారింది. ఆమె దగ్గర దాదాపు 495 గ్రాముల బంగారం, దాదాపు 5.5 కిలోగ్రాముల వెండి, చరాస్తుల పరంగానే కాకుండా, స్థిరాస్తుల పరంగా తన పేరు మీద దాదాపు రూ.8.83 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వర్గాలు తెలుపుతున్నాయి.

ఆమె భర్త సమరేశ్ సింగ్ కూడా తక్కువ ధనవంతుడు కాదు. ఆయన దగ్గర దాదాపు 390 గ్రాముల బంగారం, దాదాపు 4 కిలోగ్రాముల వెండి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ విషయానికొస్తే, సమరేశ్ దగ్గర దాదాపు రూ.8.08 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద రోహిణి, సమరేశ్ ల మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.15 కోట్లు (సుమారు $1.5 మిలియన్ USD). వివాదాలను పక్కన పెడితే, వారి ఆర్థిక పరిస్థితి బాగుందని కొందరు రాజకీయ ప్రముఖులు పేర్కొన్నారు.